: జయ ప్రమాణ స్వీకారానికి టీఆర్ఎస్ ఎంపీ కవితకు ఆహ్వానం
అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలంటూ టీఆర్ఎస్ ఎంపీ కవితకు ఆహ్వానం అందింది. దాంతో రేపు ఉదయం ఆమె చెన్నై వెళ్లనున్నారు. ఈ ఉదయం సీఎం కేసీఆర్ జయకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు రేపటి జయ ప్రమాణ స్వీకారోత్సవానికి చెన్నైలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మధ్యాహ్నం తమిళనాడు గవర్నర్ రోశయ్యను కలసిన జయ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల జాబితాను ఆమె గవర్నర్ కు అందజేశారు.