: ముందస్తు బెయిల్ వచ్చినందుకు సంతోషంగా ఉంది: దాసరి
బొగ్గు క్షేత్రాల స్కాంలో ఢిల్లీలోని పటియాల సీబీఐ కోర్టు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వడంపై దర్శకుడు దాసరి నారాయణరావు స్పందించారు. బెయిల్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఢిల్లీలో మీడియాతో అన్నారు. ఈ కేసు నుంచి తాను నిర్దోషిగా బయటపడతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. న్యాయమే గెలుస్తుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. ఇదే సమయంలో సినీ నటుడు పవన్ కల్యాణ్ తో తాను నిర్మించబోయే సినిమా అక్టోబర్ నుంచి మొదలవుతుందని దాసరి వెల్లడించారు.