: మోదీ ప్రధాని అయ్యాక భారత్ కొత్త శక్తిని సంతరించుకుంది: జైట్లీ


ఏన్ డీఏ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్రం రిపోర్టు కార్డు విడుదల చేసింది. ఈ మేరకు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడారు. సంవత్సర పాలనలో తమ ప్రభుత్వం సాధించిన లక్ష్యాలను వివరించారు. మోదీ ప్రధాని అయ్యాక భారత్ కొత్త శక్తిని సంతరించుకుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఉందని వివరించారు. ఈ ఏడాదిలో ప్రధాని 18 దేశాల్లో పర్యటించారని చెప్పారు. దేశంలో ఆత్మహత్య చేసుకునే రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పెంచామని, ఏడాదిలో నక్సల్స్ హింస 22 శాతం తగ్గిందని వెల్లడించారు. జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించామని, ఆర్థికలోటును తగ్గించడంలో విజయవంతమైనట్లు జైట్లీ చెప్పుకొచ్చారు. నగదు బదిలీ పథకంలో లోపాలను సరిచేశామని వివరించారు.

  • Loading...

More Telugu News