: ఐపీఎల్ ఆడుతున్న కరేబియన్లకు ఆంబ్రోస్ హెచ్చరిక!


ఐపీఎల్ పోటీల్లో ఆడుతున్న వెస్టిండీస్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకి రావడం అంత సులువు కాదని బౌలింగ్ దిగ్గజం కర్ట్ లీ ఆంబ్రోస్ హెచ్చరించాడు. డైనమిక్ ఓపెనర్ క్రిస్ గేల్ వంటి ఓపెనర్లు లేకుండానే వెస్టిండీస్ జట్టు ఇంగ్లాండులో పర్యటించి సిరీస్ ను 1-1 తేడాతో ముగించగలిగిందని ఆయన గుర్తు చేశాడు. మూడు రోజుల్లోనే ఇంగ్లాండ్ జట్టును విండీస్ బౌలర్లు రెండుసార్లు ఆలౌట్ చేశారని వివరించాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఆకర్షణీయ కాంట్రాక్టులు ఉంటాయని, వాటిపై సంతకం పెట్టిన ఆటగాళ్లంతా తదుపరి ఫలితాలనూ అనుభవించాల్సి వుంటుందని అన్నాడు. ఏ పోటీలకైనా దేశం తరపున అత్యుత్తమ టీమును పంపాలని అందరూ భావిస్తారు. అది కుదరనప్పుడు అందుబాటులో ఉన్న వారిని పంపక తప్పదని అన్నాడు. ఎవరి నిర్ణయాన్నీ ఎవరూ ఆపలేరని అన్నాడు. "ఎంపిక చేసుకున్న కొత్త టీం మంచి ప్రతిభను కనబరుస్తూ ఉన్నప్పుడు పాతవాళ్లు వస్తే వారిని తిరిగి తీసుకోవాలా?" అని ప్రశ్నించిన ఆయన, తనవరకూ దానికి సమాధానం 'లేదు' అనే చెబుతానని అన్నాడు.

  • Loading...

More Telugu News