: ఇండియాలో అతి తక్కువ ధరకు లభించే 'విండోస్' ఆధారిత టాబ్లెట్ ఇదే!


కేవలం రూ. 4,999 రూపాయల ధరలో విండోస్-8 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ సహాయంతో పనిచేసే టాబ్లెట్ భారత మార్కెట్లో విడుదలైంది. విండోస్ సిస్టమ్ పై పనిచేసే టాబ్లెట్లలో అతి తక్కువ ధరకు లభించేది ఇదేనట. ఐబాల్ సంస్థ 'ఐబాల్ స్లైడ్ ఐ701' పేరిట దీన్ని దేశవాళీ మార్కెట్లో విడుదల చేసింది. ప్రముఖ రిటైల్ స్టోర్లలో, పలు ఈ-కామర్స్ వెబ్ సైట్లలో దీని అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. విండోస్ 8.1 సిస్టమ్ ను ప్రాథమికంగా లోడ్ చేసినప్పటికీ, దీన్ని విండోస్ 10కు సులువుగా అప్ గ్రేడ్ చేసుకోవచ్చని ఐబాల్ పేర్కొంది. ఒక సంవత్సరం పాటు క్లౌడ్ విధానంలో 1 టెరా బైట్ స్టోరేజీని ఉచితంగా ఇస్తున్నట్టు కూడా ప్రకటించింది. 7 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే, క్వాడ్ కోర్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్, 1జిబీ డీడీఆర్3 రామ్, 16 గిగాబైట్ల ఇన్ బిల్ట్ స్టోరేజీ, 32 గిగాబైట్ల ఎక్స్ పాండబుల్ సామర్థ్యం, 2 ఎంపీ కెమెరా, 3200 ఎంఎహెచ్ బ్యాటరీతో లభించే టాబ్లెట్ లో వైఫై, బ్లూటూత్, యూఎస్ బీ డాంగిల్ సాయంతో 3జి తదితర సదుపాయాలూ ఉన్నాయి. అన్నట్టు దీని వెనుకవైపున సంస్థ బ్రాండ్ అంబాసిడర్ కరీనా కపూర్ ఆటోగ్రాఫ్ కూడా ఉంది. దీన్ని కొనుగోలు చేసే వారికి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ గా రూ. 699 విలువైన హెచ్ డీఎంఐ కేబుల్, మరో రూ. 599 విలువైన మూడు కవర్లు ఉచితంగా ఇస్తారట. ఇదేదో బాగుంది కదూ?

  • Loading...

More Telugu News