: కోహ్లీయా? ధోనీయా? ఎవరో ఒకరికే చాన్స్!
ప్రస్తుత ఐపీఎల్ సీజనులో అత్యంత ఆసక్తికర మ్యాచ్ నేడు జరగనుంది. భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వన్డే జట్టు కెప్టెన్ ధోనీల నేతృత్వంలోని బెంగళూరు, చెన్నై జట్లు ఫైనల్ లో స్థానం కోసం క్వాలిఫయర్-2 మ్యాచ్ లో తలపడనున్నాయి. రాంచీలో జరిగే ఈ మ్యాచ్ కోసం కేటాయించిన టిక్కెట్లన్నీ అమ్ముడుపోగా, ఈ పోరు అభిమానులను అలరిస్తుందని క్రీడాపండితులు భావిస్తున్నారు. కెప్టెన్ కూల్ గా పేరున్న ధోనీ, తన టీంను గెలిపిస్తాడా? లేదా మంచి దూకుడు మీదున్న కోహ్లీ దాన్ని కొనసాగిస్తాడా? అన్నది నేడు తేలనుంది. ఈ పోరులో గెలిచే జట్టు ఆదివారం నాడు ముంబైతో ఈడెన్ గార్డెన్స్ లో జరిగే ఫైనల్ పోరుకు అర్హత సాధిస్తుంది. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ లో టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు సగం గెలిచినట్టేనని అంచనా.