: తలసాని ఓ కబ్జాకోరు... నకిలీ డాక్యుమెంట్లతో స్థలాన్ని కబ్జా చేశారు!: మర్రి శశిధర్ రెడ్డి


కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై విరుచుకుపడ్డారు. తలసాని ఓ కబ్జాకోరు అని ఆరోపించారు. నీలం బాలయ్య అనే వ్యక్తికి చెందిన స్థలాన్ని తలసాని ఆక్రమించారని, అందుకు నకిలీ డాక్యుమెంట్లు పుట్టించారని మీడియాకు తెలిపారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాను ప్రజలతో కలిసి పోరాడతానని స్పష్టం చేశారు. తలసాని అక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గమనించాలని కోరారు.

  • Loading...

More Telugu News