: రూ.1400కే బెంగళూరు నుంచి విశాఖకు విమానయానం
తక్కువ చార్జీ టికెట్ తో విమానయాన సంస్థలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రముఖ విమానయాన సంస్థ 'ఎయిర్ ఏషియా ఇండియా' ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. బెంగళూరు నుంచి విశాఖపట్నంకు వచ్చే నెలలో విమాన సర్వీసు ప్రారంభించనున్నామని, ఈ విమానంలో తక్కువ ధరకు ప్రయాణించాలని కోరుకునేవారు రూ.1,400 చెల్లించి ముందస్తుగా టిక్కెట్ కొనుక్కోవాలని ప్రకటించింది. ఈ ఆఫర్ ధర ఈ నెల 24 వరకే ఉంటుందని, ఆలోగా ప్రయాణికులు టిక్కెట్ కొనుక్కోవాలని తెలిపింది. ఢిల్లీ నుంచి తమ విమాన సర్వీసులను ఎయిర్ ఏషియా ఇండియా ఈ రోజు ప్రారంభించింది. ఈ సందర్భంగా ఈ ఆఫర్ విషయాన్ని తెలిపింది.