: ఈ సైకిల్ కంటే కారే చవక అంటారు!


వరల్డ్ క్లాస్ కార్ల తయారీ దిగ్గజ 'ఆడి' తాజాగా ఓ స్పోర్ట్స్ సైకిల్ ను మార్కెట్లో లాంచ్ చేసింది . విద్యుత్ తో నడిచే ఈ సైకిల్ ధర ఎంతో తెలుసా?... సుమారు రూ.12.5 లక్షలు! దీని కంటే చూడచక్కని మిడ్ రేంజ్ కారే చవక అనిపించడంలేదూ! ఇక, ఈ కాస్ట్ లీ బైసికిల్ విషయానికొస్తే... దీని బరువు 5.8 కిలోలు. ఈ రేసింగ్ సైకిల్ నిర్మాణంలో కార్బన్ ఫైబర్ ఫ్రేమ్ ఉపయోగించారు. దాని బరువు 790 గ్రాములు. తేలిగ్గా ఉన్నా దృఢమైనది. ఆడి కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 50 మోడళ్లలో పరిమిత సంఖ్యలో విడుదల చేసింది వీటిని. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అనదగ్గ పనితనం ఈ సైకిల్ అణువణువులో కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు.

  • Loading...

More Telugu News