: నోరు జారిన హోం మంత్రి నాయిని
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంటున్న 'మిషన్ కాకతీయ'పై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇది 'మిషన్ కాకతీయ' కాదు 'కమిషన్' కాకతీయ అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. రోజూ ఈ విమర్శలు వినీవినీ టీఎస్ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి మైండ్ లో అదే ఫిక్స్ అయినట్టుంది. వివరాల్లోకి వెళ్తే, ఈ రోజు నాయిని చెరువుల పునరుద్ధరణపై ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా, ఆయన మాట్లాడుతూ 'మిషన్ కాకతీయ' అనబోయి, నోరుజారి 'కమిషన్ కాకతీయ' అనేశారు. అంతేకాదు, తాను తప్పుగా మాట్లాడిన విషయాన్ని గుర్తించకుండా, మాట్లాడుతూనే ఉన్నారు. దీంతో, పక్కనే ఉన్న విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అప్రమత్తమయ్యారు. "అన్నా, కమిషన్ కాదు మిషన్" అంటూ నాయినిని అప్రమత్తం చేశారు. అది చూసిన పాత్రికేయులు మాత్రం హాయిగా నవ్వుకున్నారు.