: అత్యాచారం చేయలేదన్న నిందితుడు
ఢిల్లీలో ఐదేళ్ల బాలిక గుడియాపై అత్యాచార ఘటనకు సంబంధించి కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు మనోజ్ కుమార్(22) గుడియాపై తాను అత్యాచారానికి పాల్పడలేదంటున్నాడు. కాగా ఈ ఘటనలో మనోజ్ కుమార్ కు ప్రదీప్ అనే మరో వ్యక్తి కూడా సహకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మనోజ్ కుమార్ ను పోలీసులు రేపు(సోమవారం)న్యాయస్థానంలో ప్రవేశపెడుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఢిల్లీ ప్రజలు ఆందోళన ఉదృతం చేశారు. కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితులను ఉరితీయాలని బీజేపీ నేత సుష్మాస్వరాజ్ డిమాండ్ చేస్తున్నారు.