: బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్
ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద ఉన్న గోదావరి నదిపై నిర్మించిన వంతెనపై నుంచి ఆర్టీసీ బస్సు కిందకు పడిపోయిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చనిపోయిన ఇద్దరు వ్యక్తుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 35 మందికి పైగా ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వీరందరికీ భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.