: మోదీ ఏడాది పాలనకు సున్నా కంటే తక్కువ మార్కులు ఇస్తానంటున్న లాలూ
ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్ డీఏ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వానికి తానైతే సున్నా కంటే తక్కువ మార్కులు ఇస్తానని అన్నారు. దేశంలో పంట నష్టపోయిన బాధిత రైతులకు సహాయం చేయడం లోను, యువతకు ఉద్యోగాలు కల్పించడంలోలోను విఫలమయ్యారన్నారు. అంతేగాక విదేశాలలో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కు తీసుకుని రావడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. జనతా పరివార్ లో ఆరు పార్టీల విలీనంపై ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, జేడీయూ అధినేత శరద్ యాదవ్ తో సమావేశమయ్యేందుకు ఢిల్లీ వెళుతున్న సమయంలో లాలూ మీడియాతో పైవిధంగా మాట్లాడారు.