: మెడిసిన్ టాపర్ గా శ్రీవిధుల్... వివరాలు
ఏపీ ఎంసెట్ ఫలితాలను రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ లు విడుదల చేశారు. వైద్య విద్య, వ్యవసాయ విభాగానికి సంబంధించిన ర్యాంకులను కామినేని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెడిసిన్ లో మొత్తం 89.89 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని చెప్పారు. ఇందులో బాలికలు 91.27, బాలురు 87.48 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మెడిసిన్ లో 151 మార్కులు సాధించిన విధుల్ టాప్ ర్యాంకర్ గా నిలిచాడు. రెండో ర్యాంక్ సాయి భరద్వాజ (151), థర్డ్ ర్యాంక్ శ్రీరామ దామిని, ఫోర్త్ ర్యాంక్ జయ హరీష్, ఫిఫ్త్ ర్యాంక్ అనీష్ గుప్తా సొంతం చేసుకున్నారు.