: ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల... అనుకున్న దానికంటే ఐదు రోజుల ముందుగానే ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ ఫలితాలను విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ, అనుకున్న దానికంటే ఐదు రోజుల ముందుగానే ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో హాజరైన వారు 1,62,807 మంది కాగా... వైద్య విద్య, వ్యవసాయ విభాగంలో 81,027 మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్ లో 77.42 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 24 నుంచి ర్యాంక్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని మంత్రి గంటా తెలిపారు. వచ్చే నెలలో కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పారు.