: తలలో బాణంతో 240 కిలోమీటర్ల ప్రయాణం!
ఓ నిశ్చితార్థం విషయంలో జరిగిన చిన్న గొడవ విల్లంబులతో యుద్ధానికి దారితీసింది. దీనిలో ఓ యువకుడి తలలో బాణం గుచ్చుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ గిరిజన తెగలకు చెందిన ఓ భిల్లుల గ్రామంలో జరిగింది. ప్రకాష్ అనే యువకుడి ఇంట నిశ్చితార్థం జరుగుతున్న వేళ, పక్కనే ఉండే అర్జున్ అనే వ్యక్తి కుటుంబసభ్యులతో గొడవ జరిగింది. ఇది పెరిగి పెద్దదై ఒకరిపై ఒకరు బాణాలు వేసుకునేదాకా వచ్చింది. ఈ ఘటనలో ప్రకాష్ మెదడులోకి ఓ బాణం దిగింది. దీంతో అతన్ని ఇండోర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందుకోసం ఆయన తలలో బాణంతోనే సుమారు 240 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. ఇండోర్ వైద్యులు దాదాపు గంట పాటు ఆపరేషన్ నిర్వహించి ప్రకాష్ తలలోని బాణాన్ని తొలగించారు.