: హైహీల్స్ నిబంధన లేదు...క్షమించండి: కేన్స్ నిర్వాహకులు
హైహీల్స్ వివాదంపై కేన్స్ నిర్వాహకులు స్పందించారు. కార్ల్ టన్ హోటల్ లో నిర్వహించిన విందులో హాలీవుడ్ డైరెక్టర్ థైరీ ఫ్రీమాక్స్ మాట్లాడుతూ, హైహీల్స్ వివాదంపై క్షమించాలని కోరారు. కేన్స్ చిత్రోత్సవాల్లో రెడ్ కార్పెట్ పై నడిచేటప్పుడు తప్పనిసరిగా హై హీల్స్ ధరించాలన్న నిబంధనేదీ లేదని స్పష్టం చేశారు. తాజా కేన్స్ చిత్రోత్సవాల్లో హైహీల్స్ ధరించలేదన్న కారణంగా కొంత మంది మహిళలను భద్రతా సిబ్బంది రెడ్ కార్పెట్ పైకి అనుమతించలేదు. దీనిపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో కేన్స్ నిర్వహణను తూర్పారపట్టారు. దీంతో స్పందించిన కేన్స్ నిర్వాహకులు వివాదానికి ముగింపు పలుకుతూ క్షమాపణలు కోరారు.