: రిటైర్మెంట్ ఆలోచనలేదు... కొత్తగా వచ్చినట్టుంది: హర్భజన్


ఇప్పుడే రిటైర్మెంట్ ఆలోచన లేదని, మరో ఐదేళ్లపాటు క్రికెట్ ఆడే సత్తా ఉందని స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెప్పాడు. రెండేళ్ల సుదీర్ఘ విరామం తరువాత టీమిండియాలో చోటుదక్కించుకున్న అనంతరం భజ్జీ మాట్లాడుతూ, ఈ రోజు కోసం ఎంతో ఆశగా ఎదురుచూశానని చెప్పాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని భజ్జీ వెల్లడించాడు. టీమిండియాలో చోటు దక్కించుకునేందుకు రెండేళ్లు కఠిన సాధన చేశానని చెప్పాడు. సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే తనకు స్పూర్తినిచ్చారని హర్భజన్ తెలిపాడు. టీమిండియా జట్టులో తొలిసారి చోటు సంపాదించినంత ఆనందంగా ఉందని భజ్జీ వెల్లడించాడు. కాగా, బంగ్లాదేశ్ తో తలపడే టీమిండియా టెస్టు జట్టులో హర్భజన్ చోటు దక్కించుకోవడంలో ఐపీఎల్ ప్రదర్శన ప్రముఖపాత్ర పోషించింది.

  • Loading...

More Telugu News