: డ్రైవింగ్ పై దృష్టి తగ్గింది...సెల్ఫీలు, వీడియో కాల్ లు కూడా చేస్తున్నారు


స్మార్ట్ ఫోన్ లు జీవితంలో ప్రధాన భాగం అయిపోతున్నాయి. దీంతో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ వినియోగించకుండా ఉండలేకపోతున్నారు. డ్రైవింగ్ చేసే విధానంపై అమెరికాలోని మల్టీ నేషనల్ టెలీ కమ్యూనికేషన్ కార్పొరేషన్ అనే సంస్థ అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనంలో 70శాతం మంది స్మార్ట్ ఫోన్లో సంభాషణలు జరుపుతూనే డ్రైవింగ్ చేస్తున్నారని తేలింది. దీంతో ప్రమాదాల బారిన పడుతున్నారని ఆ అధ్యయనం స్పష్టం చేసింది. వీరు కేవలం ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడంతోనే ఆగకుండా, డ్రైవ్ చేస్తూ సెల్ఫీలు కూడా దిగుతున్నారని, కొన్ని సార్లు ఇంటర్నెట్ కూడా వాడుతున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది. 61 శాతం మంది డ్రైవింగ్ లో టెక్స్ట్ మెసేజ్ లు టైప్ చేస్తుండగా, 33 శాతం మంది మెయిల్ చూసుకుంటున్నారట. 27 శాతం మంది ఫేస్ బుక్, 14 శాతం మంది ట్విట్టర్, 14 శాతం మంది ఇన్ స్టాగ్రమ్, 11 శాతం మంది స్నాప్ చాట్ చేస్తున్నారట. వీరిలో 17 శాతం మంది సెల్ఫీలు తీసుకుంటున్నారట. మరో పది శాతం మంది వీడియో కాలింగ్ డ్రైవింగ్ లోనే చేస్తున్నారట. వీడియో కాలింగ్ అంటే మొబైల్ లో మన నిర్వాకం చూపెడుతూ మాట్లాడేది అన్న సంగతి తెలిసిందే!

  • Loading...

More Telugu News