: పోర్న్ స్టార్ ను పీఏగా నియమించుకున్న చైనా వ్యాపారవేత్త... బాధపడిపోతున్న అభిమానులు
చైనా ఆర్థిక వ్యవస్థ ఎంతో బలమైనది. ఇప్పుడక్కడి వ్యాపారవేత్తలు లక్షల కోట్లకు పడగలెత్తారు. విలాసవంతమైన భవంతులు, ప్రైవేటు జెట్ విమానాలపై మిలియన్ల కొద్దీ ఖర్చు పెడుతున్నారు. తాజాగా, ఓ బిజినెస్ టైకూన్ తన పర్సనల్ అసిస్టెంట్ (పీఏ)గా ఓ పోర్న్ స్టార్ ను నియమించుకుని సంచలనం సృష్టించాడు. చిన్న వయసులోనే పోర్న్ ఇండస్ట్రీలో ప్రవేశించి రసికులను ఉర్రూతలూగిస్తున్న రోలా మిసాకి (22) అనే ముద్దుగుమ్మతో 15 ఏళ్లకు 'ప్రత్యేక' అవసరాల కోసం కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. ఒప్పందం ప్రకారం ఏడాదికి రూ.3 కోట్లకు పైగా అందుకోనుందట ఈ పోర్న్ తార. కాగా, ఈ సెక్సీ భామను పోర్న్ పరిశ్రమకు దూరం చేసిన బిజినెస్ మేన్ వినోద రంగానికి చెందిన వ్యక్తి అని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంటోంది. అతడు భారీగా టిప్స్ ఇస్తుంటాడని, విలాస పురుషుడని వివరించింది. కాగా, మిసాకితో కలిసి ఈ వ్యాపారవేత్త ఇటీవలే బీజింగ్ లో ఓ ఈవెంట్ కు హాజరయ్యాడట. ఆ సమయంలో సదరు బిజినెస్ టైకూన్ ముఖానికి ముసుగు ధరించి ఉన్నాడని మీడియా పేర్కొంది. ఇదిలావుంటే... అమ్మడు పోర్న్ ఇండస్ట్రీకి దూరమవ్వడంపై ఆమె అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఈ విధంగా ఆమె తమను విడిచివెళ్లడం ఏమీ బాగాలేదని వాపోయారు. అతనితో వెళుతుందని అస్సలు భావించలేదని పేర్కొన్నారు. ఏదేమైనా ఇది తమకు విషాద దినమని, ఆమె తిరిగి ఇండస్ట్రీకి వచ్చిందాకా తాము వేచి చూస్తుంటామని సోషల్ మీడియాలో తెలిపారు.