: 'పాబ్లో' మరణంతో విషాద గీతం అందుకున్న పాప్ క్వీన్
ముచ్చటపడి పెంచుకుంటున్న చేప చనిపోవడం ఆ పాప్ గాయనిని కలచివేసింది. అమెరికా పాప్ స్టార్ మిలీ సైరస్ ఓ చేపను పెంచుకుంటోంది. దానికి 'పాబ్లో' అని పేరు పెట్టుకుని, అల్లారుముద్దుగా చూసుకోసాగింది. అయితే, ఆ చేప కొన్ని రోజుల క్రితం ప్రాణాలు విడిచింది. దీంతో, సైరస్ కు గుండె పగిలినంత పనైంది. చేప మరణం ఆమెలో కలుగజేసిన విషాదం నుంచి ఓ గీతం పుట్టుకొచ్చింది. చేపతో అనుబంధాన్ని వర్ణిస్తూ ఓ పాట రాసి, దానికి బాణీలు కట్టి పాడిందీ అమెరికా అమ్మడు. చేప చనిపోయిన తర్వాత తెలిసిందని, దానిపై తనకు ఎంత ప్రేమ ఉందో అని ఆ పాటలో పేర్కొంది. అన్నట్టు... ఆ పాటను పాబ్లోకే అంకితమిచ్చింది సైరస్. పాబ్లో... ఓ బ్లో ఫిష్. దానిపై తనకున్న ప్రేమకు గుర్తుగా సైరస్ ఫిబ్రవరిలో బ్లాక్ అండ్ వైట్ టాటూను వేయించుకుంది కూడా. ఈ పాప్ క్వీన్ తన 'హ్యాపీ హిప్పీ ఫౌండేషన్' ద్వారా ఈ పాటను లాంచ్ చేసింది.