: అతడి పేరు చర్చకే రాలేదు: బీసీసీఐ చీఫ్ సెలక్టర్


బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియాను ప్రకటించిన అనంతరం బీసీసీఐ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ మీడియాతో మాట్లాడారు. సెలక్షన్ ప్రక్రియ గురించి చెబుతూ, జట్టు ఎంపిక సందర్భంగా యువీ పేరు చర్చకే రాలేదని తెలిపారు. గత కొంతకాలంగా నిరాదరణకు గురవుతున్న యువరాజ్ సింగ్ ను ఈసారి కూడా ఎంపిక చేయకపోవడంపై విమర్శలు రేగాయి. ధోనీ మద్దతు లేనందునే యువీకి జట్టులో చోటు దక్కడం లేదన్నది బహిరంగ రహస్యం! ఇక, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఎంపికను పాటిల్ సమర్థించుకున్నారు. బంగ్లాదేశ్ జట్టులో ఆరుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నందునే భజ్జీని టెస్టు జట్టులోకి తీసుకున్నామని వివరించారు. ఎంపిక సందర్భంగా రవీంద్ర జడేజాతో పాటు మరికొందరు స్పిన్నర్ల పేర్లను పరిశీలించామని తెలిపారు.

  • Loading...

More Telugu News