: జూన్ లో ఏపీ రాజధాని ప్రాంతంలో జగన్ దీక్ష


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జూన్ 3, 4 తేదీల్లో దీక్ష చేపట్టబోతున్నారని ఆ పార్టీ నేత, మాజీమంత్రి కె.పార్థసారధి తెలిపారు. ఏపీ రాజధాని ప్రాంతాలు గుంటూరు, విజయవాడ మధ్య ఈ దీక్ష చేపట్టనున్నట్టు మీడియా సమావేశంలో చెప్పారు. ప్రభుత్వ రైతు విధానాలకు నిరసనగానే జగన్ దీక్ష చేయనున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదని పార్థసారధి వ్యాఖ్యానించారు. అంతకుముందు జగన్ హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ నేతలతో భేటీ అయి, దీక్ష ఏర్పాట్లపై చర్చించారు.

  • Loading...

More Telugu News