: ఈ నెల 23న సీఎంగా జయలలిత ప్రమాణస్వీకారం
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిర్దోషిగా బయటపడ్డ ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత మరోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈ నెల 23న తమిళనాడు సీఎంగా అమ్మ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు అన్నా డీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి ఓ ఆంగ్ల పత్రికకు వెల్లడించారు. ప్రస్తుత సీఎంగా కొనసాగుతున్న ఒ.పన్నీర్ సెల్వం 22న రాజీనామా చేయనున్నారని చెప్పారు. అదేరోజు ప్రజలకు దర్శనమివ్వనున్న జయ పార్టీ వ్యవస్థాపకులు ఎంజీ రామచంద్రన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. తరువాత పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలు సమావేశమై జయను అన్నా డీఎంకే లెజిస్లేచర్ పార్టీ నాయకురాలిగా ఎన్నుకోనున్నారు.