: ఉస్మానియా విద్యార్థుల వల్లే కేసీఆర్ కు సీఎం కుర్చీ దక్కింది: నాగం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులను కేసీఆర్ బచ్చాగాళ్లనడం సబబు కాదని మండిపడ్డారు. విద్యార్థులతో పెట్టుకుంటే దగ్ధమవుతాడని మహబూబ్ నగర్ లో హెచ్చరించారు. ఉస్మానియా విద్యార్థుల పోరాటాలు, త్యాగాల ఫలితంగానే కేసీఆర్ కు తెలంగాణ సీఎం కుర్చీ దక్కిందని చెప్పారు. అలాంటిది వారిపైనే అలా మాట్లాడం సరికాదన్నారు. ఉస్మానియా అంటేనే పోరాటల గడ్డ అని నాగం గుర్తు చేశారు.