: జ్వరం తగ్గిస్తానంటూ, రెండు రోజుల బాలుడిపై మంత్రగత్తె చిత్రహింసలు


పుట్టి రెండు రోజులైనా కాలేదు. ఆ చిన్నారి బాలుడు ఓ మంత్రగత్తె చేతిలో చిత్రహింసలు అనుభవించాల్సి వచ్చింది. ఈ ఘటన అసోంలోని ఓ గ్రామంలో జరుగగా, మంత్రగత్తె దురాగతాన్ని ఓ యువకుడు తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. ఆ వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది. పుట్టినప్పటి నుంచి ఆ బాలుడికి విపరీతమైన జ్వరం వస్తుండగా, తల్లిదండ్రులు మంత్ర వైద్యం కోసం తీసుకెళ్లారు. చిన్నారి జ్వరం తగ్గిస్తానంటూ 50 ఏళ్ల మంత్రగత్తె పిల్లాడి మెడ పట్టుకొని పైకెత్తి నడిపించడం మొదలు పెట్టింది. కొన్ని అడుగులు వేయించింది. ఈ దురాగతాన్ని గురించి తెలుసుకున్న పోలీసులు ఇందుకు కారణమైన ఇద్దరు మహిళలను కటకటాల వెనక్కు పంపారు. చిన్నారిని ఆసుపత్రిలో చేర్చగా, జ్వరం తగ్గి పూర్తిగా కోలుకున్నాడు. ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలే ఇటువంటి ఘటనలకు కారణమని అధికారులు అంటున్నారు.

  • Loading...

More Telugu News