: ఖమ్మం జిల్లాలో జింకల వేట...వేటగాళ్లను వెంటాడి పట్టుకున్న అటవీ శాఖాధికారులు


తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో నేటి ఉదయం జింకల వేట కలకలం రేపింది. జిల్లాలోని వేంసూరి మండల పరిధిలోని అడవుల్లోకి గుట్టుచప్పుడు కాకుండా చొరబడ్డ ఇద్దరు వ్యక్తులు అత్యాధునిక తుపాకీతో రెండు జింకలను కాల్చేశారు. అయితే వేటగాళ్ల సంచారాన్ని గమనించిన అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వేటగాళ్ల ఆచూకీ లభించిన వెంటనే, వారి వెంటబడ్డారు. స్కార్పియో వాహనంలో వచ్చిన వేటగాళ్లు అటవీ శాఖాధికారుల నుంచి తప్పించుకుని పారిపోయేందుకు విశ్వయత్నం చేశారు. అయితే కిలో మీటర్ల మేర వేటగాళ్లను వెంటాడిన అటవీ శాఖాధికారులు ఎట్టకేలకు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి నుంచి టర్కీలో తయారైన అత్యాధునిక తుపాకీతో పాటు చనిపోయిన జింకను స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News