: వరంగల్ 'నిట్' సీట్ల విషయంలో కేంద్రం నిర్ణయానికి కట్టుబడతాం: మంత్రి గంటా
వరంగల్ 'నిట్' సీట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికే కట్టుబడతామని ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఏపీకి ప్రత్యేకంగా కేంద్రం నిట్ కేటాయించినా ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే తమకు సీట్లు తగ్గాయని చెప్పారు. అందుకే వరంగల్ నిట్ లో తమ రాష్ట్ర విద్యార్థులకు కొన్ని సీట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరామని గంటా తెలిపారు. భోగాపురంలో ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై విజయనగరం, విశాఖ జిల్లాల అధికారులతో మంత్రి గంటా చర్చించారు. ఇక్కడ ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై రిట్ అనే సంస్థ సర్వే చేస్తుందని, నివేదిక వచ్చాక ఎయిర్ పోర్టుకు ఎంతభూమి కావాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.