: మంచు మనోజ్ దంపతులకు గవర్నర్ నరసింహన్, నటుడు మహేష్ దంపతుల ఆశీర్వాదం
మంచు మనోజ్, ప్రణతి రెడ్డిలను ఆశీర్వదించేందుకు హైదరాబాద్ లోని హైటెక్స్ ప్రాంగణానికి అతిరథమహారధులు తరలివస్తున్నారు. కొద్దిసేపటికిందట గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి మనోజ్ దంపతులకు పుష్పగుచ్చాలు అందించి ఆశీర్వదించారు. ఆ వెంటనే హీరో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ శుభాకాంక్షలు తెలిపారు. తరువాత మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, మ్యాట్రిక్స్ ప్రసాద్, హీరో సూర్య, నటుడు అలీ, తదితరులు మనోజ్, ప్రణతిలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తరలివస్తున్నారు.