: ‘మంచు’ వారి పెళ్లి వేడుకలో కేసీఆర్... మంత్రులతో కలిసి హాజరు


‘మంచు’వారి వివాహ వేడుకలో తెలంగాణ సీఎం కేసీఆర్ సందడి చేశారు. తన కేబినెట్ లోని ముఖ్యమైన మంత్రులతో కలిసి మాదాపూర్ లోని హైటెక్స్ లో జరిగిన మంచు మనోజ్, ప్రణతిల వివాహానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు మంచు మోహన్ బాబు ఘనంగా స్వాగతం పలికారు. చిన్న కుమారుడి పెళ్లికి వచ్చిన కేసీఆర్ కు మోహన్ బాబు తన పెద్ద కొడుకు విష్ణు, కోడలు విరోనికాలతో పాదాభివందనం చేయించారు. దగ్గరుండి తన కుటుంబ సభ్యులను కేసీఆర్ కు పరిచయం చేసిన మోహన్ బాబు, కేసీఆర్ వెళ్లేదాకా ఆయన వెంటే ఉన్నారు. వివాహ వేడుకకు కేసీఆర్ వచ్చిన సందర్భంగా అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News