: యూసఫ్ గూడలో కాల్పులు... ఏటీఎం వద్ద మహిళపై దుండగుల దాడి


హైదరాబాదులోని యూసఫ్ గూడలో కొద్దిసేపటి క్రితం జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంకు వచ్చిన ఓ మహిళపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అనంతరం ఆమె నుంచి నగదు, నగలు అపహరించుకుని వెళ్లారు. కాల్పుల నుంచి చాకచక్యంగా తప్పించుకున్న బాధిత మహిళ, వెనువెంటనే తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేగంగా స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకుని మహిళ నుంచి వివరాలు సేకరించారు. అనంతరం దుండగుల కోసం గాలింపు మొదలుపెట్టారు.

  • Loading...

More Telugu News