: హైటెక్స్ లో ‘మంచు’ వారి పెళ్లి సందడి షురూ...తరలివస్తున్న సినీ, రాజకీయ ప్రముఖులు


‘మంచు‘ వారి పెళ్లి సందడి మాదాపూర్ లోని హైటెక్స్ లో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు, టాలీవుడ్ యువ హీరో మంచు మనోజ్ కుమార్, ప్రణతిల వివాహ వేడుక ప్రారంభమైంది. నేటి ఉదయం 9.10 గంటలకు జరగనున్న ఈ పెళ్లి వేడుక సందడి నేటి తెల్లవారుజామునే ప్రారంభం కాగా, ఇప్పుడిప్పుడే సినీ, రాజకీయ ప్రముఖులు హైటెక్స్ చేరుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో హైటెక్స్ వద్ద నగర పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే టాలీవుడ్ నటుడు, మాజీ ఎంపీ హరికృష్ణ, రచయితలు గొల్లపూడి మారుతీరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ ఆడిటర్ విజయసాయిరెడ్డి సహా పెద్ద సంఖ్యలో ప్రముఖులు హైటెక్స్ చేరుకున్నారు.

  • Loading...

More Telugu News