: చంద్రబాబుపై జగన్ ట్వీట్
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబద్ధాలు చెబుతూ రైతులు, చేనేత కార్మికులు, డ్వాక్రా మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారని ప్రతిపక్ష నేత జగన్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లాలో పరిస్థితి దయనీయంగా ఉందని, వాస్తవ పరిస్థితులు చూస్తే ప్రభుత్వం చెబుతున్న దానికి భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. అభాగ్యుల తరపున తాము గొంతుక వినిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. సమస్యలపై వెనుదిరిగేది లేదని ఉద్ఘాటించారు. జగన్ అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే.