: కుంభకోణాలతో కొల్లగొట్టారు: అమిత్ షా
యూపీఏ హయాంలో దేశాన్ని దోచుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు. కుంభకోణాలతో కొల్లగొట్టారని ఆరోపించారు. నరేంద్ర మోదీ ఏడాది పాలనతో దేశానికి ఎంతో ఆదాయం ఒనగూరిందని తెలిపారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆయన మాట్లాడుతూ... యూపీఏ ప్రభుత్వం 76 స్కాములతో 10 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నదని ఆరోపించారు. మోదీ విదేశాలకు వెళ్లినప్పుడు ఆయనకు అక్కడ ఘనస్వాగతం లభిస్తోందని వివరించారు. మోదీ... అమెరికా, జర్మనీ, ఫిజీ లేక భూటాన్... ఇలా ఎక్కడికెళ్లినా వేలాదిమంది స్వాగతం పలుకుతున్నారని చెప్పుకొచ్చారు. అది ఏ ఒక్క వ్యక్తికో, బీజేపీ పార్టీకో లభిస్తున్న గౌరవం కాదని, 125 కోట్ల మంది ప్రజలకు లభిస్తున్న గౌరవం అని అమిత్ షా తెలిపారు.