: 'అరుణ షాన్ బాగ్' పేరుతో అవార్డు ఇవ్వనున్న ఎంపీ ప్రభుత్వం
42 ఏళ్ల పాటు కోమాలో ఉండి నిన్న మృత్యువు ఒడికి చేరుకున్న అరుణ షాన్ బాగ్ కు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఘన నివాళి అర్పించింది. అంతేకాదు, ఇకపై ప్రతి ఏటా అరుణ పేరిట అవార్డు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. మహిళలపై దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడే స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డు ఇస్తారు. అవార్డుకు ఎంపికైన సంస్థకు రూ. లక్ష నగదు రివార్డు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, అరుణ జీవితంలో జరిగిన ఘటన అత్యంత బాధాకరమని చెప్పారు. గౌరవానికి అరుణ ఒక చిహ్నమని కొనియాడారు. మహిళల పట్ల ఆలోచించే విధానంలో మార్పు రావాలని చెప్పారు. చట్టాలను కూడా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.