: ముద్దులొలికే అభయ్ రామ్.... తన 'జూనియర్' ఫోటోలను రిలీజ్ చేసిన ఎన్టీఆర్
పుట్టిన రోజును పురస్కరించుకుని తన కుమారుడి ఫోటోలను అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఇన్నాళ్లు పుత్రుడి వివరాలు గోప్యంగా ఉంచిన జూనియర్ ఎన్టీఆర్, రేపు తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు మంచి గిఫ్ట్ ఇచ్చారు. కుమారుడు అభయ్ రామ్ ను ఎత్తుకుని ఉన్న ఫోటోను అభిమానుల కోసం జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్లో పోస్టు చేశారు. అభయ్ రామ్ ఫోటోలను చూసిన కొందరు అభిమానులు 'అచ్చం తండ్రిలాగే' ఉన్నాడని అభిప్రాయపడుతుండగా, తల్లి కళ్లు వచ్చాయంటూ మరికొందరు పోలికలు తెస్తున్నారు. ఎలా ఉన్నా తండ్రిని మించిన తనయుడవుతాడంటూ వీరాభిమానులు ఆశీర్వదిస్తున్నారు. మొత్తానికి పుట్టిన రోజు కానుకగా, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మంచి బహుమతి అందజేశారు. కాగా, రేపు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు!