: ఆ కవలలు అపురూపం...!
సాధారణంగా కవలలలో పోలికలు ఎక్కువగా వుంటాయి. వెంటనే గుర్తుపట్టడం కూడా కష్టమే. అంతేకాదు, లక్షణాలు, అభిరుచులు కూడా దాదాపు ఒకేలా వుంటాయి. అయితే, జార్ఖాండ్ రాజధాని రాంచీ లోని ఓ కవల అక్కాచెల్లెళ్లు రూపం, గుణగణాలు, అభిరుచులలోనే కాకుండా, మార్కులు తెచ్చుకోవడంలో కూడా ఒకేలా ఉంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. అనురూప, అపురూప ఇద్దరూ కవలలు. ఇటీవల జార్ఖండ్ లో ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో వీరిద్దరూ ఒకేలా మార్కులు తెచ్చుకున్నారు. ఇంగ్లిష్ లో 95, సోషల్ లో 97, లెక్కల్లో 98, సైన్స్ లో 99, కంప్యూటర్స్ లో 100 మార్కులు తెచ్చుకున్నారు. హిందీలో మాత్రం అనురూప తన చెల్లెలు అపురూప కంటే ఒక మార్కు ఎక్కువ తెచ్చుకుంది. దీంతో 'కవలలంటే ఇలా ఉండాలి' అని అంతా అభినందిస్తున్నారు.