: మూడు దేశాల పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వస్తున్న మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటన ముగిసింది. మొదట చైనా, తర్వాత మంగోలియా, ఆ తర్వాత దక్షిణ కొరియాల్లో పర్యటించిన మోదీ... తన పర్యటనను ముగించుకుని స్వదేశానికి తిరుగుపయనమయ్యారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నుంచి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా, మోదీకి సియోల్ లో ఘనంగా వీడ్కోలు పలికారు. తన పర్యటన సందర్భంగా, మూడు దేశాలతో పలు అంశాలపై మోదీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు.