: సీఎంను రాళ్లతో కొట్టడమేంటి?... ఏం మాటలవి?: గాలి ముద్దుకృష్ణమనాయుడు
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు మండిపడ్డారు. జగన్ ప్రతిపక్ష నేతలా మాట్లాడడం లేదని, ఓ రౌడీలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రైతు భరోసా యాత్ర సందర్భంగా ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదని అన్నారు. సీఎంను రాళ్లతో కొట్టండని ప్రజలకు పిలుపునివ్వడం ప్రతిపక్ష నేతకు తగదని హితవు పలికారు. అయినా, అవేం మాటలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని భవితవ్యం అతనికే తెలియదని ముద్దుకృష్ణమ ఎద్దేవా చేశారు. జగన్ వ్యాఖ్యలపై కేసు పెట్టే అవకాశమున్నా, తాము అలా చేయబోమని అన్నారు.