: వాషింగ్ మిషన్ నుంచి ముడతలు లేని దుస్తులు... ఓ మహిళ కనిపెట్టిన సూపర్ చిట్కా!


నిత్యమూ బట్టలు వాషింగ్ మిషన్ లో ఉతకటం, ఆపై డ్రయ్యర్లో వేసి ఆరబెట్టడం, ముడతలు పడ్డ బట్టలు తీసి ఐరన్ చేయడం తదితర పనులతో మహిళలు అలసటకు గురవుతారని అందరికీ తెలిసిందే. అయితే, ఉతికిన బట్టలకు ముడతలు లేకుండా చూసేందుకు ఓ మహిళ సూపర్ చిట్కాను కనుగొంది. అది చాలా సింపుల్. బట్టలు ఉతికిన తరువాత డ్రయ్యర్ లో ఆరబెట్టే ముందు రెండంటే రెండు ఐస్ క్యూబ్ లు అందులో వేస్తే చాలు. అదేంటి డ్రయ్యర్ లో ఐసు ముక్కలేస్తే బట్టలకు ముడతలు ఎలా పోతాయని అనుకుంటున్నారా? డ్రయ్యర్ పనిచేసే సమయంలో వెలువడే వేడికి బట్టల్లో వేసిన ఐసు ముక్కలు తొలుత నీటిగా, ఆపై నీటి ఆవిరిగా మారుతుంది. దీంతో బట్టలకు ఆవిరి పట్టి ముడతలన్నీ పోతాయి. ఇస్త్రీ చేసినట్టుండే దుస్తులు సిద్ధమవుతాయి. అయితే, మంచి ఫలితాల కోసం డ్రయ్యర్ ను గరిష్ఠ ఉష్ణోగ్రతపై ఉంచాలని మాత్రం మరవద్దు.

  • Loading...

More Telugu News