: టీడీపీ, బీజేపీల బంధం మరింత బలోపేతం... చంద్రబాబు ‘ఎమ్మెల్సీ’ ఆఫర్ కు అమిత్ షా ఒకే!


గడచిన ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన టీడీపీ, బీజేపీల మధ్య బంధం మరింత బలోపేతం కానుంది. పొత్తు నేపథ్యంలో ఇప్పటికే అటు కేంద్ర కేబినెట్ లోనే కాక, ఇటు రాష్ట్ర కేబినెట్ లోనూ మంత్రి పదవులు ఇచ్చిపుచ్చుకున్న ఆ పార్టీలు, తాజాగా ఎమ్మెల్సీ సీట్లనూ పంచుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు నిన్న ఢిల్లీలో జరిగిన భేటీలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు సీట్ల సర్దుబాటుకు దాదాపు సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మూడు స్థానాలు దక్కనున్నాయి. వీటిలో ఓ సీటును బీజేపీకి ఇచ్చేందుకు తమకేమీ అభ్యంతరం లేదని చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు అమిత్ షా కూడా సరేనన్నట్లు విశ్వసనీయ సమాచారం. నిన్న రాత్రి ఢిల్లీలో అమిత్ షా ఇంటిలో అరగంటకు పైగా సాగిన భేటీలో అటు బీజేపీ నేతలతో పాటు ఇటు టీడీపీ నేతలు పాలుపంచుకున్నారు.

  • Loading...

More Telugu News