: బాబుకు ఓటేసి నీడలేని దరిద్రులమయ్యాం: పోలవరం నిర్వాసితుల ఆందోళన


చంద్రబాబుకు ఓటేస్తే తమకు మరింత నష్ట పరిహారం వస్తుందని భావించామని, ఎన్నికలకు ముందు ప్రచారం సమయంలో ఆయన కూడా అదే మాట చెప్పారని, ఇప్పుడు మాత్రం తమకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారని పోలవరం ముంపు గ్రామం అంగలూరు వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు పక్కా ఇళ్లు కట్టిస్తామని, ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు కనీసం మంచినీటి సౌకర్యం, రోడ్లు లేని స్థలాల్లోకి తరుముతున్నారని విమర్శించారు. పట్టిసీమ రైతులకు భారీ పరిహారం ఇచ్చి తమకు అతి తక్కువ పరిహారం ఇస్తున్నారని, అదేమని ప్రశ్నిస్తే తాము గిరిజనేతరులమని సమాధానం వస్తోందని వాపోయారు. పూర్తి పరిహారం ఇచ్చేవరకూ అంగలూరు నుంచి కదిలేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. కాగా, ఈ ఉదయం అంగలూరును ఖాళీ చేయించేందుకు పోలీసులు, అధికారులు వెళ్లగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News