: నాకు ఆయన కళ్లంటే చాలా ఇష్టం: ప్రభాస్
'బాహుబలి' హీరో ప్రభాస్ 'రాక్షసుడు' ఆడియో లాంచ్ చేశాడు. అనంతరం మాట్లాడుతూ, తనకు సూర్య కళ్లంటే చాలా ఇష్టమని తెలిపాడు. సూర్య కళ్లతో చక్కగా భావాలు పలికిస్తాడని కొనియాడాడు. సూర్యను సూపర్ యాక్టర్ అని చెప్పడంలో తప్పులేదని అన్నాడు. ఆయన సినిమాల్లో తనకు నచ్చిన సినిమాలు చాలా ఉన్నాయని, వాటిలో ముఖ్యమైనది 'కాక్క కాక్క' అని తెలిపాడు. అంతకుముందు, నిర్మాత జ్ఞానవేల్ రాజా గురించి మాట్లాడుతూ... ఆయన తమిళంలో మంచి నిర్మాత అని చెప్పాడు. ఇక, ఈ సినిమా దర్శకుడు వెంకట్ ప్రభు ఓ డిఫరెంట్ డైరక్టర్ అని, తమిళంలో ఆయన తెరకెక్కించిన సినిమాలు తప్పక చూడండని ఫ్యాన్స్ కు సూచించాడు.