: బాలికల భద్రతకు ప్రియాంకా చోప్రా కృషి


దేశంలో బాలికలకు భద్రతతో కూడిన సురక్షిత పరిస్థితులు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని బాలీవుడ్ నటీమణి ప్రియాంకా చోప్రా అన్నారు. ఢిల్లీలో ఐదేళ్ల చిన్నారిపై ఘాతుకంపై ఆమె స్పందించారు. బాలికలు క్షేమంగా ఉండగల వాతావరణం తీసుకురావడానికి యునిసెఫ్ తో కలిసి ప్రయత్నిస్తున్నట్లు ఆమె తెలిపారు. ముఖ్యంగా గ్రామాలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా కూతుర్ల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై తల్లిదండ్రులకు, మహిళను సరైన విధంగా అర్థం చేసుకునేలా బాలురకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రియాంకా యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News