: చిరంజీవి 150వ సినిమాను నేను డైరక్ట్ చేస్తే అంతే సంగతులు!: వర్మ
దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ, చిరంజీవి 150వ చిత్రంపై స్పందించారు. ఒకవేళ తాను ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తే, అది తప్పకుండా అట్టర్ ఫ్లాప్ అవుతుందని తెలిపారు. చివరికి మిగిలేది విషాదమేనని పేర్కొన్నారు. అయినా, తనకు మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాను డైరక్ట్ చేసే స్థాయిలేదని అన్నారు. ఆయనతో సినిమా చేయడం తన వల్లకాదని చెప్పుకొచ్చారు. గత కొంతకాలంగా వర్మ వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు.