: 'డిస్కో డ్యాన్సర్' హీరో మిథున్ చక్రవర్తికి అస్వస్థత... ఆసుపత్రికి తరలింపు
వెటరన్ బాలీవుడ్ నటుడు, 'డిస్కో డ్యాన్సర్' హీరో మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, వాంతులతో బాధపడుతున్న ఆయనను కాందివాలిలోని 'రక్షా' ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. స్వల్ప చికిత్స అనంతరం ఆయన్ను డిశ్చార్జ్ చేయగా, ఆపై కడుపునొప్పి, వాంతులు వస్తుండడంతో ఆయన్ను మరో ఆసుపత్రిలో చేర్చారు. కాగా, సంచలనం సృష్టించిన శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో ఇటీవల మిథున్ చక్రవర్తిని సీబీఐ అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాను కేవలం శారదా చిట్ ఫండ్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా మాత్రమే వ్యవహరించానని, అందుకుగాను తాను తీసుకున్న రూ. 2 కోట్లను వెనక్కు ఇచ్చేస్తానని మిథున్ వెల్లడించారు.