: 'వైట్ విడో'... 400 చావులకు బాధ్యురాలు!


బ్రిటన్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ మహిళా టెర్రరిస్టు సమంతా ల్యూత్ వైట్ 400 మంది చావుకు కారణమని తెలుస్తోంది. అధికారిక భద్రతా నివేదికల ప్రకారం, 32 ఏళ్ల సమంతా సోమాలియాకు చెందిన అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థలో కీలక సభ్యురాలిగా ఎదిగిన తర్వాత, పలు దాడులకు పథక రచన చేసిందని 'మిర్రర్ ఆన్ లైన్' మీడియా సంస్థ పేర్కొంది. సోమాలియా, కెన్యా దేశాల్లో ఆత్మాహుతి దాడులు, కారు బాంబు పేలుళ్లకు ఈ కిరాతకురాలే కారణమని వివరించింది. కిందటి నెలలో కెన్యాలో ఓ యూనివర్శిటీలో జరిగిన దాడిలో 148 మంది మృతి చెందిన ఘటనకు సమంతానే బాధ్యురాలని భావిస్తున్నట్టు తెలిపింది. నలుగురు బిడ్డల తల్లైన ఈ లండన్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ 'టెర్రర్' బాట పట్టింది. ప్రస్తుతం సమంతా అల్ షబాబ్ నేత అహ్మద్ ఉమర్ కు కుడి భుజం అని సోమాలియా ఉగ్రవాద వ్యతిరేక విభాగం అధికారి ఒకరు తెలిపారు. కాగా, సమంతా భర్త జెర్మైన్ లిండ్సే తీవ్రవాదే. 2005 లండన్ దాడులకు పాల్పడిన వారిలో లిండ్సే కూడా ఉన్నాడు. ట్రైన్ ను పేల్చివేసి, తానూ హతుడయ్యాడు. అందుకే సమంతాను 'వైట్ విడో' అని పిలుస్తారు.

  • Loading...

More Telugu News