: జార్ఖండ్ గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది


జార్ఖండ్ గవర్నర్ గా ద్రౌపది ముర్ము ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. దీంతో, జార్ఖండ్ గవర్నర్ గా పదవీబాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా ఆమె చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఆమె చేత జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వీరేంద్ర సింగ్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర సీఎం రఘువర్ దాస్, మాజీ సీఎంలు శిబు సోరెన్, అర్జున్ ముండాలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము గతంలో రెండు సార్లు బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నవీన్ పట్నాయక్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు.

  • Loading...

More Telugu News