: లేడిస్ హాస్టళ్లో సైకో హల్ చల్... అడ్డుకున్న యువతిపై కత్తితో దాడి


హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్ లో కొద్దిసేపటి క్రితం కలకలం రేగింది. లేడిస్ హాస్టల్ లోకి చొరబడేందుకు యత్నించిన ఓ సైకో అక్కడి అమ్మాయిలను భయభ్రాంతులకు గురి చేశాడు. అంతేకాక తన యత్నాన్ని అడ్డుకున్న మమత అనే అమ్మాయిపై అతడు కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సైకో దాడిలో మమతకు తీవ్ర గాయాలయ్యాయి. వెనువెంటనే స్పందించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సైకో కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News