: ఆ ముద్దుగుమ్మను ఎవరూ గుర్తుపట్టలేదట!


సాధారణంగా సినీ నటులకు జనాల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వారు కనపడితే ట్రాఫిక్ కూడా జామ్ కావాల్సిందే. అయితే, దీనికి విరుద్ధంగా ఓ ఘటన జరిగింది. వరుస హిట్లతో దూసుకెళుతున్న ముద్దుగుమ్మ, మహానటుడు కమల్ హసన్ కూతురు శృతిహసన్ ను ఎవరూ గుర్తుపట్టలేదట. ఓ న్యూస్ మేగజీన్ కు ఇచ్చిన ఇంటర్వూలో, ఈ విషయాన్ని స్వయంగా శృతినే వెల్లడించింది. "ఇటీవలే శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్లా. ఎలాంటి మేకప్ లేకుండా, కళ్లజోడు ధరించి సాధారణ అమ్మాయిలాగా దర్శనానికి వెళ్లాను. ఈ సందర్భంగా, నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు. దాంతో, స్వామి వారిని చాలా ప్రశాంతంగా దర్శించుకున్నా" అని శృతి చెప్పింది.

  • Loading...

More Telugu News